close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

విద్యుత్తు ఉద్యోగుల డిమాండ్లపై స్పందించాలి


చినరంగనిపాలెం (భీమవరం గునుపూడి), న్యూస్‌టుడే: విద్యుత్తు ఒప్పంద, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు ఆదివారం కోరారు. విద్యుత్తు కార్మిక ఐక్యవేదిక పిలుపు మేరకు భీమవరం డీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు తమ డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ చేపట్టిన నిరసన దీక్షలు 6వ రోజుకు చేరాయి. దీక్ష శిబిరం సందర్శించిన ఉమామహేశ్వరరావు వారికి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజారామోహనరావు, ఉద్యోగుల సంఘం నాయకులు కంబాల శ్రీనివాస్‌, సుబ్బరాజు, భగవాన్‌, సీఐటీయూ కార్యదర్శి జె.శ్రీనివాస్‌, అధ్యక్షుడు బర్రె రాము, ఫజులద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు