close

ఆదివారం, మే 27, 2018

తాజా వార్తలు

అంగడిలో అంగన్‌వాడీ గుడ్లు


కుక్కునూరు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీలోని సరకులు పక్కదారి పట్టకుండా ఎన్ని ప్రణాళికలు వేసినా ఫలితం ఉండటం లేదు. ప్రధానంగా కోడిగుడ్లు బహిరంగ మార్కెట్‌కు వెళ్లిపోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాటిపై ఐసీడీఎస్‌ ముద్ర వేస్తున్నారు. అయినా పక్కదారి పడుతున్నాయి. కుక్కునూరులో ఐసీడీఎస్‌ గుడ్లు ఓ దుకాణంలో ఆదివారం ప్రత్యక్షమయ్యాయి. ఓ బాలిక దుకాణంలో కోడి గుడ్లు కొనగా వాటిపై ఐసీడీఎస్‌ ముద్ర ఉంది. మరి ఏం చేస్తే అంగన్‌వాడీలో అక్రమాలకు తెరపడుతుందో అధికారులకే తెలియాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు