close

శనివారం, సెప్టెంబర్ 22, 2018

తాజా వార్తలు

వైభవోపేతంగా చక్రస్నానం 

వైభవోపేతంగా చక్రస్నానం 

కనుముకుల(భూదాన్‌పోచంపల్లి), న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక  బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం చక్రస్నానం మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో హోమం, బలిహారణం, రుద్రాభిషేకం, నైవేద్య నివేదన పూజా కార్యక్రమాలు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ వైభవోపేతంగా జరిగాయి. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఏలూరు శిక్షణ ఎస్పీ రిషాంత్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కోట మల్లారెడ్డి, పుష్పలత, రంగ మధు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు