close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

 ఆరోగ్యాన్ని పునర్నిర్మిద్దాం 


వీరమాచినేని రామకృష్ణారావు 

 ఆరోగ్యాన్ని పునర్నిర్మిద్దాం 


ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆరోగ్యాన్ని పునర్నిర్మిద్దాం.. మధుమేహం కూడా జలుబు, దుగ్గు లాంటి సాధారణ సుస్తీలే.. భయపడవద్దని వీరమాచినేని రామకృష్ణారావు పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ మైదానంలో ఆదివారం సాయంత్రం ఆహార నియమాలపై వీరమాచినేని రామకృష్ణారావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడాకు చెందిన నెఫ్రాలజిస్టు సూచనలను తీసుకొని తెలుగు ప్రజలకు అనుగుణంగా తాను ఆహార నియమాలను రూపొందించానన్నారు. అయితే ఇవి వైద్యులు సూచిస్తున్న వాటికి పూర్తి భిన్నమని పేర్కొన్నారు. తన సూచనలతో బరువు తగ్గడం మంచినీళ్ల ప్రాయమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక మధుమేహం ఉండకూడదన్నారు. వ్యాయామాలు, ఆహార నియంత్రణ వల్ల మనిషి సన్నబడడని పేర్కొన్నారు. ఆహార నియమాల పేరుతో తక్కువ తిని శరీర శక్తిని కోల్పోయే స్థితి తెచ్చుకుంటున్నారన్నారు. ఇన్సులిన్‌ సక్రమంగా, క్రమ పద్ధతిలో నిర్వహిస్తే శరీర బరువు పూర్తిగా నియంత్రణలోనికి వస్తుందన్నారు. బియ్యం పాలిష్‌ చేయడం వల్ల అందులోని సారం పూర్తిగా పోతుందన్నారు. పొట్టు ఉన్న బియ్యం తినాలని వీరమాచినేని కృష్ణారావు సూచించారు. బరువు తగ్గడం, మధుమేహ నియంత్రణ ఇలా పలు రకాలకు సంబంధించి ఆహార నియమాలను వీరమాచినేని రామకృష్ణారావు సూచించారు. ఏయూ రిజిస్ట్రారు ఆచార్య ఉమామహేశ్వరరావు, పైడా కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు