close

ఆదివారం, మే 27, 2018

తాజా వార్తలు

సందడి చేసిన నటి అభినయ 

సందడి చేసిన నటి అభినయ 

శంభో శివ శంభో, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, దమ్ము వంటి చిత్రాల్లో తన హావభావాలతో ఆకట్టుకున్న అభినయ మన నగరంలో మెరిసింది. చిన్నారులతో సందడి చేసింది. నగరంలోని చినగదిలి హెల్త్‌సిటీ ఆవరణలోని పినాకిల్‌ ఆసుపత్రిలో నిర్వహించిన అంతర్జాతీయ కాక్లియర్‌ ఇంప్లాంట్‌ డే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్చి 3న జరిగే కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ అవగాహన నడక గోడ పత్రికను ఆవిష్కరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించి, వినికిడి లోపంతో ఉంటే వెంటనే వైద్యులకు చూపించాలని ఆమె కోరారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో శాంతి ఆశ్రమం మూగ, బధిర విద్యార్థులతో సందడి చేశారు. వారు ప్రదర్శించిన బొమ్మలు, తయారుచేసిన అలంకరణ వస్తువులు పరిశీలించారు. ఈ సందర్భంగా పినాకిల్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత ఆడిటరీ పరీక్షలు నిర్వహించారు. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ కార్యక్రమానికి ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటానికి అంగీకరించారని ఆసుపత్రివర్గాలు పేర్కొన్నాయి.
 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు