close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

పూర్వ విద్యార్థులు సహకరించాలి 

మంత్రి కామినేని పిలుపు 

పూర్వ విద్యార్థులు సహకరించాలి 

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: చదువుకున్న విద్యా సంస్థను సమున్నతంగా తీర్చిదిద్దే క్రమంలో పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అన్నారు. ఆంధ్రవైద్యకళాశాల ఆవరణలో శతాబ్ది బ్లాక్‌ పేరుతో రూ.40కోట్ల ఖర్చుతో నిర్మించనున్న భవనానికి ఆదివారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లితో కలిసి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కామినేని మాట్లాడుతూ ప్రతిపాదిత మొత్తంలో పూర్వ విద్యార్థులు రూ.15కోట్లు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమమన్నారు. ఇదే సహకారం మున్ముందు కూడా కొనసాగించాలని, రాబోవు కాలంలో ప్రభుత్వపరంగా పలు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి, పూర్వ విద్యార్థుల సంఘానికి త్వరలో సీఎం సమక్షంలో ఎంఒయు కుదుర్చుతానని హామీ ఇచ్చారు. మంత్రి గంటా, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరోగ్య సేవల పరంగా పెద్ద దిక్కుగా కేజీహెచ్‌ ఉందని, మౌలిక పరమైన వసతులతోపాటు వైద్య పరికరాలను ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్‌ ఎన్‌.సుబ్బారావు, సెంచనరీ అకడమిక్‌ బ్లాక్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ టి.రవిరాజు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌, కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జి.అర్జున, అంకోసా అధ్యక్షురాలు డాక్టర్‌ ఆర్‌.శశిప్రభ, డాక్టర్‌ ఈ.పెదవీర్రాజులు పాల్గొన్నారు. భవన నిర్మాణానికి విరాళం ఇచ్చిన డాక్టర్‌ సదాశివరావును మంత్రి కామినేని శాలువ కప్పి సత్కరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు