close

సోమవారం, మే 28, 2018

తాజా వార్తలు

నేటి నుంచి మల్లేశ్వరుని దర్శనానికి అనుమతి 

నేటి నుంచి మల్లేశ్వరుని దర్శనానికి అనుమతి 

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే:  మల్లేశ్వరాలయ పునరుద్ధరణలో భాగంగా రెండో రోజు ఆదివారం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య రుత్వికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మండప పూజలు, మండప దీప హోమాలు, పంచామృతాది అధివాసములు నిర్వహించారు. మూల విగ్రహాలకు ధాన్యం, ఫలం, ఫుష్పాది వాసాల్లో భాగంగా ఈవో పద్మ దంపతులతో రుత్వికులు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 7.42 నిమిషాలకు యంత్రస్థాపన, కళాన్యాసం, పూర్ణాహుతి కార్యక్రమాలు అనంతరం శాంతి కల్యాణం చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాదశర్మ, ప్రధానార్చకులు దుర్గాప్రసాద్‌, మల్లేశ్వరశాస్త్రి, పాలకమండలి సభ్యులు బీరక ప్రసాద్‌, పద్మశేఖర్‌, సూర్యలత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు