close

సోమవారం, సెప్టెంబర్ 24, 2018

తాజా వార్తలు

పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు 


జిల్లా ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ నిఖిల 

నాంపల్లి, న్యూస్‌టుడే: పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేయాలని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ నిఖిల ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆపరేషన్‌ స్మైల్‌-4 (ముస్కాన్‌) అంశంపై సమావేశం నిర్వహించారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకునే వారిపై బాలకార్మికుల చట్టం, 14 సంవత్సరాల పైబడిన పిల్లలను ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చే వారిపై బాండెడ్‌ లేబర్‌ యాక్ట్‌ల కింద పూర్తి ఆధారాలతో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమంలో పాల్గొనే ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మహిళా శిశు అభివృద్ధి, పోలీసు, కార్మిక, రెవెన్యూ, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఛైల్డ్‌ హెల్ప్‌ లైన్‌కు వచ్చిన ఫిర్యాదులను ప్రతీ నెల చివరి శనివారం తన వద్దకు తీసుకురావాల్సిందిగా సంబంధిత కో-ఆర్డినేటర్‌ను ఆమె ఆదేశించారు. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే స్మైల్‌-4 కార్యక్రమంలో నగరంలోని హోటళ్లు, దుకాణాలు, గాజుల బ్యాగుల కంపెనీలు, చేపల మార్కెట్లు తదితర ప్రాంతాల్లో నిఘా ఉంచాలని ఆమె సూచించారు. పోలీసు శాఖ అదనపు డీసీపీ బారి, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు శ్యామలాదేవి, కార్మిక శాఖ సహాయ కమిషనర్‌ జి.శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా బాలల రక్షణ అధికారి ఇంతియాజ, మహిళా శిశు అభివృద్ధి శాఖ జిల్లా సంక్షేమాధికారి సునంద, అదనపు డీఎంహెచ్‌ఓ సరళాకుమారి పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు