close

సోమవారం, మే 28, 2018

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో ‘పింక్‌ కోకోనట్‌’ 

జూబ్లీహిల్స్‌లో ‘పింక్‌ కోకోనట్‌’ 

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 15ఎలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘పింక్‌ కోకోనట్‌’ డిజైనర్‌ బొటిక్‌ను మార్గదర్శి మేనేజింగ్‌ డెరెక్టర్‌ శైలజాకిరణ్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో ఏర్పాటు చేసిన భారత-పాశ్చాత్య, భారతీయ దుస్తులను పరిశీలించారు. డిజైనర్లు సంగీత గొయాంక, శ్వేత, అరుణ తుమ్మల రూపొందించిన దుస్తులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన చీరలను స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. స్టోర్‌లో దుస్తులకు అనుగుణంగా సంగీత గొయాంక ‘అడార్న్‌’ పేరుతో రూపొందించిన సెమీ ప్రీషియస్‌ ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శ్వేత రూపొందించిన డిజైనర్‌ గాజులు దుస్తులకు తగినట్లుగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా శైలజాకిరణ్‌ మాట్లాడుతూ నేటితరం అమ్మాయిలకు తగిన విధంగా, చూడగానే నచ్చేలా దుస్తులు ఉన్నాయన్నారు. వివాహ వేడుకలలో పాల్గొనే వారికి విభిన్నతతో కూడిన దుస్తులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు