close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

కష్టే ఫలి: పీవీ సింధు 

కష్టే ఫలి: పీవీ సింధు 

దుండిగల్‌, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించుకొనేందుకు నిరంతరం కృషి చేయాలని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. కష్టపడితే ఎంచుకున్న రంగాలలో విజయాలను సొంతం చేసుకోవచ్చన్నారు. బౌరంపేటలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహించనున్న పాఠశాల వార్షికోత్సవాలకు బుధవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ... చిన్నారుల ఆసక్తికి అనుగుణంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలను సాధిస్తారన్నారు. నా తల్లిదండ్రులు వాలీబాల్‌ క్రీడాకారులు అయినప్పటికీ నా ఇష్టానికి అనుగుణంగా చిన్నతనం నుంచి ప్రోత్సహించారన్నారు. తల్లిదండ్రులు, శిక్షకుడు అందించిన సహాయసహకారాలతో నేను ఈస్థాయికి ఎదిగానన్నారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించిన పాఠశాలకు చెందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరపరిచిన జయహో పాటకు పాఠశాలకు చెందిన 491 మంది విద్యార్థులు ఒకేసారి నృత్యం చేయడం విశేషం. పాఠశాల ప్రో వైస్‌ఛైర్మన్లు జి.రమేష్‌, వై.లక్ష్మీనారాయణ, అకడమిక్‌ డైరెక్టర్‌ రేఖఅగర్వాల్‌, ప్రిన్సిపాళ్లు తారాసురేష్‌, గీతా విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు