close
BETA SITE


వైఫల్యపాఠాలు! 

వైఫల్యపాఠాలు! 

వైఫల్యాలు కూడా పాఠాలు నేర్పుతాయనేది మరోసారి రుజువవుతోంది. ‘జస్టిస్‌ లీగ్‌’ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఆ సినిమా విడుదల అయితే, తమ సంస్థపై కనకవర్షమే కురుస్తుందని ఆ చిత్రాన్ని రూపొందించిన వార్నర్‌ బ్రదర్స్‌ ఆశించింది. ఆ ఆశలతోనే ఆ చిత్ర నిర్మాణానికి దాదాపు 300 మిలియన్‌ డాలర్‌లను గుమ్మరించింది. అయితే, ఆ చిత్రానికి ఇప్పటి వరకూ అంతర్జాతీయంగా 570 మిలియన్‌ డాలర్‌లే వచ్చాయి. ఇంత తక్కువ కలెక్షన్‌లు వార్నర్‌ బ్రదర్స్‌లో అంతర్మథనానికి కారణమైంది. తమ చిత్రంలో చాలా వరకూ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్నాయనీ, దీనికి పోటీగా నిలబడిన ‘మార్వెల్‌’ చిత్రం, ప్రేక్షకుల మనసుల్నీ, వారి డబ్బునూ కొల్లగొట్టుకుపోయిందనీ వార్నర్‌ సంస్థ నిర్ధారణకు వచ్చింది. ఇంత అంతర్మథనమూ, చివరికి ఎక్కడికి దారి తీస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వైఫల్యాలకు కారణంగా ఒకటి రెండు పెద్ద తలకాయలు ఎగిరి పోతాయని అందరూ వూహించినదే. ఇప్పుడు అలాగే జరుగుతోంది. వార్నర్‌ సంస్థలో కో-ప్రొడ్యూసర్‌గా ఉండి, ‘జస్టిస్‌ లీగ్‌’ చిత్ర నిర్మాణాన్ని చూసిన జోన్‌బెర్గ్‌ తమ సంస్థను వదిలి వెళ్తున్నారని వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌ ప్రెసిడెంట్‌ టోబీ ఎమెరిచ్‌ ప్రకటించారు. ‘ఆయనే వార్నర్‌ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మా ప్రమేయం ఏమీ లేదు. ఆయన వెళ్లి, ప్రొడ్యూస్‌ రాయ్‌లీతో కలిసి, సినిమాలు తీసుకుంటారట! ఆయన సొంత ప్రొడక్షన్‌ పెట్టుకోవటం మాకూ ఆనందమే!’ అంటూ ‘వెళ్లిపోదల్చుకున్న’ జోన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. జోన్‌, ఈ ఏడాది డిసెంబర్‌ చివరికి వార్నర్‌ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆయన స్థానంలో ఎవరు వస్తారో తెలియటం లేదు. ఇదెలా ఉన్నా, ‘జస్టిస్‌ లీగ్‌’ నేర్పిన గుణపాఠాల కారణంగా, వార్నర్‌ బ్రదర్స్‌ ఇప్పుడు నిర్మిస్తున్న ‘అక్వామ్యాన్‌’ చిత్రం 2018 డిసెంబర్‌కు విడుదల కావచ్చు. ఈ చిత్రంలో యాంబర్‌ హెర్డ్‌ నటిస్తుంది. మరి ఎప్పుడు వస్తుందో, విడుదల వాయిదా పడుతుందో చూడాలి!

తాజావార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.