close


పవన్‌ పాటందుకున్నారిలా...! 

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ మరోసారి తన గాత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా’ అంటూ పాట పాడిన పవన్‌.. తాజా చిత్రంలో ‘కొడకా కొటేశ్వరరావు’ అంటూ సాగే పాటను ఆలపించారు. కొత్త సంవత్సరం కానుకగా ఈ పాటను డిసెంబరు 31న సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు.
‘కొడకా కొటేశ్వరరావు’ పాటకు సంబంధించిన టీజర్‌ను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో పవన్‌ పాటను హమ్‌ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత ‘కొడకా..’ అంటూ పాటను మొదలపెట్టబోయే ముందు పడిపడి నవ్వుతుంటే ‘పవన్‌కల్యాణ్‌ సర్‌! అంత ఈజీగా ఏమీ తెమలనీయరు. అది నాకు అర్థమవుతోంది’ అని అక్కడి వారు అనడం మరోసారి నవ్వులు పండాయి. దీంతో అనిరుధ్‌ అందుకుని ‘ఐ విల్‌ గివ్‌ ఎ సిగ్నల్‌’ అంటూ 1.. 2.. 3.. అనడంతో పవన్‌ పాట అందుకున్నారు. ఆ తర్వాత ‘పార్టీ టైమ్‌ బిగిన్స్‌ ఫ్రమ్‌ 31 డిసెంబరు 6.00గంటలు’ అని ముగించారు. ఇక గాయకుడిగా మరోసారి పవన్‌ విశ్వరూపం చూడాలంటే డిసెంబరు 31 వరకూ ఆగాల్సిందే.

హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎన్‌.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.