close
BETA SITE


లవ్‌ అంటే నేనేలే 

లవ్‌ అంటే నేనేలే 

విరాజ్‌ కె.అశ్విన్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్దికుమార్‌, రాధా బంగారు కథానాయికలు. టి.ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎల్‌.ఎన్‌.రాజు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని లవ్‌ అంటే నేనేలే... పాటని ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, దేవన్‌ ఆలపించారు.  ‘‘ఒక విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రమిది. మలేసియాలోని పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఇందులోని గీతాన్ని మణిరత్నం విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు నిర్మాత. కాశీ విశ్వనాథ్‌, అనీష్‌ కురువిల్లా, వేణు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్‌, ఛాయాగ్రహణం: ఎదురొలు రాజు.

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు