close

సమీక్ష 

శుభారంభం! 
‘ముహూర్తం’ మురిపించింది 
సెన్సెక్స్‌కు 246 పాయింట్ల లాభం 

దీపావళి సందర్భంగా నిర్వహించిన ‘మూరత్‌ ట్రేడింగ్‌’ మదుపర్లను మురిపించింది. దీంతో సంవత్‌ 2075 శుభారంభాన్నిచ్చింది. వాహన, చమురు-గ్యాస్‌, ఎంఎఫ్‌సీజీ, ఐటీ, టెక్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌కు 246 పాయింట్ల లాభం వచ్చింది. నిఫ్టీ సైతం 68 పాయింట్ల లాభంతో 10,598 పాయింట్ల వద్ద ముగిసింది. ఆకర్షణీయంగా ఉన్న షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి ప్రదర్శించడంతో బీఎస్‌ఈ చిన్న, మధ్య స్థాయి సూచీలు కూడా 1.08%, 0.62% మేర పెరిగాయి. అంతర్జాతీయ సూచీలకొస్తే ఆసియా, ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. దీపావళి మరుసటి రోజున ‘బలిప్రతిపద’ సందర్భంగా గురువారం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ మార్కెట్లు పని చేయలేదు.

దీపావళి రోజున నిర్వహించిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 35,301.88 పాయింట్ల వద్ద బలంగా ప్రారంభమైంది. 35,302.25-35,237.98 పాయింట్ల మధ్య కదలాడి చివరకు 245.77 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా 10,600 స్థాయిని దాటినా, చివరకు 68.40 పాయింట్ల లాభంతో 10,598.40 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ షేర్లలో అత్యధికంగా ఎంఅండ్‌ఎం 1.97 శాతం లాభపడింది. ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, వేదాంతా, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, యెస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్‌, ఎల్‌అండ్‌టీ, కోటక్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లాభపడిన వాటిలో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ స్వల్పంగా నష్టపోయింది. మన మార్కెట్లు పని చేయలేదు. 
దీపావళి బలిప్రతిపద సందర్భంగా గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పని చేయలేదు. ఇతర ప్రధాన మార్కెట్లకు కూడా సెలవే.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.