close

2019లో వృద్ధి 7.3 శాతమే! 

మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ అంచనా

దిల్లీ: ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం వృద్ధిరేటుతో సాగినా, 2019లో వృద్ధిరేటు 7.3 శాతానికి పరిమితం అవుతుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ అంచనా వేసింది. వడ్డీరేట్ల పెరుగుదల వల్ల రుణ వ్యయాలు అధికమై, దేశీయ గిరాకీ మందగించవచ్చని విశ్లేషించింది. 2019-20 ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులపై విడుదల చేసిన నివేదికలో మూడీస్‌ ఈ వివరాలు ప్రచురించింది. పెద్దనోట్ల రద్దు అనంతర బేస్‌ ప్రభావం వల్ల, 2018 ప్రథమార్థం (జనవరి-జూన్‌)లో భారత వృద్ధిరేటు 7.9 శాతంగా నమోదైందని మూడీస్‌ పేర్కొంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.