close
BETA SITE

డాలరు= రూ.74.45

24పైసలు క్షీణించి తాజా జీవనకాల కనిష్ఠానికి

ముంబయి: రూపాయి విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. గురువారం మరో 24 పైసలు క్షీణించింది. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ ఓ దశలో రూ.74.45తో తాజా జీవనకాల కనిష్ఠానికి చేరింది. అమెరికా కరెన్సీకి దిగుమతిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌, ద్రవ్యలోటు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ విలువ విపరీతంగా పడిపోతోందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ దెబ్బతో నేడు స్టాక్‌మార్కెట్లు కూడా కుదేలైపోతున్నాయి.

నిన్న రూపాయి రికార్డు కనిష్ఠం నుంచి కోలుకుంది. చివరకు 19 పైసలు బలపడి 74.20 వద్ద ముగిసింది. కాగా ఈరోజు ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ఆరంభంలోనే రూపాయి మారకం విలువ పతనమై రూ.74.37 వద్ద మొదలైంది. తర్వాత మరింతగా క్షీణించి తాజా జీవనకాల కనిష్ఠమైన రూ.74.45పైసలకు చేరింది. నిన్న విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1096కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. డాలరుకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా పెరగడం మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది. నేడు స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో నడుస్తున్నాయి. సెన్సెక్స్‌ 818 పాయింట్ల నష్టంతో 33942 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 256పాయింట్లు నష్టపోయి 10204 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.40 వద్ద కొనసాగుతోంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు